రాష్ట్ర స్థాయి బాతుకమ్మ ఉత్సవాలను విజయవంతం చేద్దాం | తెలంగాణ సగర మహిళా సంఘం రాష్ట్ర కార్యవర్గం తీర్మానం

రాష్ట్ర స్థాయి బాతుకమ్మ ఉత్సవాలను విజయవంతం చేద్దాం - తెలంగాణ సగర మహిళా సంఘం రాష్ట్ర కార్యవర్గం తీర్మానం

తెలంగాణ సగర మహిళా సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరపాలని రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. సోమవారం హైదరాబాద్ అంజయ్య నగర్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి గాండ్ల స్రవంతి సగర గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు శ్రీ ఉప్పరి శేఖర్ సగర గారు, రాష్ట్ర గౌరవాధ్యక్షులు శ్రీ ముత్యాల హరికిషన్ సగర గారు ముఖ్య అతిథులుగా హాజరై మార్గనిర్దేశం చేశారు 

 ఈనెల 24 వ తేదీన హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరపాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు, నిర్వహణ తదితర అంశాలపై సుదీర్ఘంగా మహిళా సంఘం రాష్ట్ర కమిటీ గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలోని పలు ప్రాంతీయ సంఘాల మహిళా సంఘాల నాయకులతో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 2 వేల మంది సగర మహిళలతో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరపాలని కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. బతుకమ్మ వేడుకల ద్వారా సగర జాతి మరింత వెలుగులోకి రావడం కోసం మహిళా సంఘం రాష్ట్ర కార్యవర్గంతో పాటు అన్ని జిల్లాల మహిళా సంఘాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర నాయకులు అభిప్రాయపడ్డారు. 

ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీమతి విజయలక్ష్మి సగర గారు, కోశాధికారి శ్రీమతి జయమ్మ సగర గారు, గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం అధ్యక్షులు మోడల రవి సగర గారు, గ్రేటర్ హైదరాబాద్ యువజన సంఘం అధ్యక్షులు ఎర్రంశెట్టి సీతారాం సగర గారు, రంగారెడ్డి జిల్లా సగర సంఘం అధ్యక్షులు మర్కా సతీష్ సగర గారు, రాష్ట్ర మహిళా  ఉపాధ్యాక్షరాలు, కార్యవర్గ సభ్యులు, జగద్గిరిగుట్ట మహిళా సగర కమిటీ సభ్యులు, అంజయ్య నగర్ మహిళా కమిటీ సభ్యులు, మూసాపేట్ కమిటీ మహిళా సభ్యులు, ఫిలింనగర్ మహిళా కమిటీ సభ్యులు, రాయిదుర్గం మహిళ కమిటీ,మణికొండ మహిళా కమిటీ సభ్యులు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మహిళా సంఘాల కార్యవర్గ సభ్యులందరూ హాజరయ్యారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బిసి బంద్ కు సగర సంఘం మద్దతు

🌸 తెలంగాణ సగర మహిళా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు 🌸